తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్‌!

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్త‌గా 495 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 247 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,05,804 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,99,878 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,685గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 4,241 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,870 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 142  మందికి క‌రోనా సోకింది.  
    

Telangana
Corona Virus
COVID19

More Telugu News